Monday, December 23, 2024

టీచర్లే దగ్గరుండి దళిత విద్యార్థులతో ఎంతటి దారుణం చేయించారో!

- Advertisement -
- Advertisement -

సభ్య సమాజం తలదించుకునే సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. మలూర్ తాలూకాలోని యలువహళ్లిలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో దళిత విద్యార్థుల చేత మలమూత్రాదులు నిండి ఉన్న సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేయించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

టీచర్లే దగ్గరుండి మరీ దళిత విద్యార్థులతో ఈ పని చేయించడం పట్ల రాష్ట్రమంతా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం మంత్రి జి. పరమేశ్వర జోక్యం చేసుకుని, జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ నవీన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రిన్సిపల్ భారతమ్మ, టీచర్ మునియప్ప, హాస్టల్ వార్డెన్ మంజునాథ్, గెస్ట్ టీచర్ అభిషేక్ లను అధికారులు సస్పెండ్ చేశారు. వీరిలో భారతమ్మ, మునియప్పలను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. యలువహళ్లిలోని ఈ రెసిడెన్షియల్ స్కూల్లో 243 విద్యార్థులు చదువుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News