Monday, December 23, 2024

ఈ నెల 22న ఇందిరా పార్కు వద్ద కర్నాటక రాజ్య రైతు సంఘం ధర్నా

- Advertisement -
- Advertisement -

సీఈవో వికాస్‌రాజ్ ను కలిసి అనుమతి కోరిన రైతు బృందం

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో జాతీయ పార్టీలు రైతులను మోసం చేసేలా హామీలు ఇస్తున్నారని కర్ణాటక రైతులు మండిపడ్డారు. దీనిపై ఈ నెల 22న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సోమవారం కర్నాటక రాజ్య రైతు సంఘ అండ్ గ్రీన్ బ్రిగేడ్ నేతృత్వంలో రైతుల బృందం తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ ను కలిసి ధర్నాకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అమలు చేయలేని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. బిజెపి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించగా,  ఇప్పుడు ఆ వ్యవసాయ చట్టాలనే సిద్ధరామయ్య అమలు చేస్తున్నారన్నారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను జాతీయ పార్టీలు అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు రైతులను మోసం చేశాయని విమర్శించారు. కనీస మద్దతు ధర కల్పించడంలో పార్టీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటకలో జాతీయ పార్టీలతో మోసపోయామని అన్నారు. తెలంగాణ రైతులు మోసపోవద్దని వారికి అవగాహన కల్పించడానికి ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News