Monday, December 23, 2024

కిరణ్‌కుమార్‌రెడ్డికి కర్ణాటక బాధ్యతలు !

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బిజెపి చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో అమిత్ షాను కలిసిన ఆయన తాజా రాజకీయాలపై చర్చించారు. నడ్డా నివాసంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కర్ణాటక మాజీ సిఎం యడ్యూరప్పను కూడా కలిశారు. ఇదే సమయంలో నడ్డా, అమిత్ షా, సంతోష్, యడ్యూరప్ప, కర్ణాటక సిఎం బొమ్మె సమావేశమై కర్ణాటక ఎన్నికలపై చర్చించారు.

వీరితో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, అభ్యర్థుల ఖరారు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికలకు సంబంధిత పలు బాధ్యతలు కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు బెంగళూరు కేంద్రంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు ఈ నెల14వ తేదీ నుంచి కర్ణాటకలో ప్రచారంలో పాల్గొనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News