Monday, January 20, 2025

కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మోదింపురం నుండి చందుపట్ల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్‌ఎస్‌కు వేసే ప్రతి ఓటు బిజేపికిక వేసినట్లేనని ఈ విషయాన్ని మై నార్టీలు గుర్తుంచుకోవాలని అన్నారు. లౌకిక పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే బిజేపికి వ్యతిరేకంగా వేసినట్లు అవుతుందని రాష్త్ర ప్రజలు గమనించి ఓటును వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాకపోను మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానని మో సం చేసిన సిఎం కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఆయన కోరారు.

మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతోనే బిజేపి, బిఆర్‌ఎస్ వేర్వేరు కాదని మరోసారి కళ్లకు కట్టినట్లుగా స్పష్టమైనదని అన్నారు. పార్లమెంటులో బిజేపి తీసుకువచ్చిన అనేక చట్టాలకు బిఆర్‌ఎస్ ఎంపిలు మద్దతు ఇచ్చారని, రాష్ట్ర ప్రజలు గమనించి బిఆర్‌ఎస్‌కు ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టాలని అ న్నారు. దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుండి జమ్ముకాశ్మీర్ వరకు భా రత్ జోడో యాత్రకు భయపడి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించిన మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా మద్దుతు తెలుపుతూ బిజేపితో బిఆర్‌ఎస్ కలిసి పనిచేస్తుందని ఆయన మరోమారు ప్రజలకు గుర్తు చేశారు. రాష్త్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కుట్రలో భాగమే బిజేపి బిఆర్‌ఎస్ రహస్య ఒప్పందం ప్రకారం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో 50శాతం ఉన్న బిసిలకు కేసీఆర్ ప్రభుత్వం ఐదు శా తం నిధులు కెటాయించి గొర్లు, బర్లు, చేపలంటూ దగా చేస్తున్నదని, రాష్త్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దా మాషా పద్ధతి ప్రకారం నిధులు కెటాయిస్తామని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని అన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు కానీ వారి కుటుంబంలో మాత్రం నలుగురికి పదువులు వచ్చాయని ఆయన మండిపడ్డారు. నియామకాలు లేకపోవడంతో యూనివర్సీటీలు నిరుద్యోగులకు కేంద్రాలుగా మారాయని, రైతులు, నిరుద్యోగులు, చేతివృత్తులు, కుల వృత్తుల వాళ్లు అందరూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. సూర్యాపేట ప్రజల స్పందన చూస్తుంటే వ చ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేస్తామన్నారు. ప్రజల సంపద ప్రజలకే పంచేలా ఇందిరమ్మ రా జ్యాన్ని తెచ్చుకుందామని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా కా ంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి జనరల్ సెక్రటరీ పటేల్ రమేష్ రెడ్డి, టిపిసిసి మహిళ కాంగ్రెస్ ఛైర్మన్ సునీతరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News