Sunday, December 22, 2024

ఏందప్పా.. 92లోనూ..

- Advertisement -
- Advertisement -

దావణగెరె: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దావణగెరె దక్షిణ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున నిలిచిన షమనూర్ శివశంకరప్ప 84000 ఓట్ల పైగా మెజార్టీతో గెలిచారు. ఈ స్థానంలో విజయానికి ప్రత్యేకత ఉంది. విజేత శివశంకరప్ప వయస్సు 92 సంవత్సరాలు. ఈ ప్రఖ్యాత స్థానంలో బిజెపికి చెందిన అజయ్‌కుమార్ 56000 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఎస్‌డిపిఐకి చెందిన ఇస్మాయిల్ జబియూల్లా మూ డో స్థానంలో ఉన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో శివశంకరప్ప ఇక్కడి నుం చి 15884 ఓట్లతో గెలిచారు. ఇంతకు ముందు ఆయన 2008, 2013, 2018ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు నాలుగో దఫా విజయం కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక వయస్కులైన అభ్యర్థి ఆయనే కావడం విశేషం. 1994లో ఆయన ఎన్నికల్లో ప్రవేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News