Thursday, January 23, 2025

కర్ణాటక హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారికి బెయిల్

- Advertisement -
- Advertisement -

హుబ్బళ్లి : మూడు దశాబ్దాల క్రితం రామమందిర ఉద్యమంలో పాలుపంచుకున్న కేసులో అరెస్టయిన హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారికి శనివారం బెయిల్ లభించింది. జైలు నుంచి రాగానే తాను ఆనాడు రామమందిరం కోసం ఆందోళనలో పాల్గొన్నానని, ఇప్పుడు అయోధ్యకు వెళ్తానని శ్రీకాంత్ పూజారి స్పష్టం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో భాగంగా గత నెల పూజారిని అరెస్ట్ చేసినట్టు పోలీస్‌లు చెప్పారు. 1992లో రామమందిర ఆందోళనలో పూజారి పాల్గొన్నారు. దొంగసారా వ్యాపారంతోపాటు రౌడీగా రికార్డుకెక్కిన పూజారిపై 16 కేసులు రెండు పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్నాయని పోలీస్‌లు చెప్పారు. తన విడుదల కోసం ఆందోళనలు సాగించిన హిందూ సమాజాలకు పూజారి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎలాంటి వారంట్, సమన్లు లేకుండానే తన వద్దకు వచ్చి మార్కెట్‌కు తీసుకు వెళతామని చెప్పి పోలీస్‌లు అరెస్ట్ చేశారని పూజారి ఆరోపించారు. తనపై ఎలాంటి పెండింగ్ కేసులు లేవనీ అన్నీ పరిష్కారమయ్యాయని, అందుకనే బెలగావి నుంచి తిరిగి వచ్చానని పూజారి చెప్పారు. 1992 లో ఎనిమిది నెలలు తాను జైలులో ఉన్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శ్రీకాంత్ పూజారి అరెస్టును బీజేపీ ఒక వివాదాస్పద అంశంగా బీజేపీ తయారు చేసింది.రాష్ట్రమంతటా ఆందోళనలు లేవదీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News