కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
హైదరాబాద్ వాసుల సజీవ దహనం
పుట్టినరోజు వేడుకలకు గోవా వెళ్లి
వస్తుండగా కలబురిగి వద్ద
టెంపోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
చెలరేగిన మంటలు, 27మందికి
గాయాలు బర్త్‌డే
బాయ్ వివాన్ దుర్మరణం
బాధితులంతా రెండు
కుటుంబాలకు చెందినవారు
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి, మృతుల
కుటుంబాలకు రూ.3లక్షల
చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.50వేల
ఆర్థికసాయం
మనతెలంగాణ/హైదరాబాద్ :కర్ణాటక కలబురిగి వద్ద శుక్రవారం ఉద యం 6 గంటల సమయంలో జరిగిన ఘో ర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగ రానికి చెందిన 8మంది మృతి చెందారు. కలబురిగి జిల్లా కమలాపుర శివారులో గూడ్స్ లారీని ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ గుంతలో బోల్తా పడింది. ఈ క్రమంలో మంటలు చెల రేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 27 మంది ప్రమాణీకులు గాయపడ్డారు. ప్రమాదంలో మృ తి చెందిన వారిలో ముకుందరావు కొడుకు సాఫ్ట్‌వేర్ ఇం జినీర్ అర్జున్ కుమార్ (37), కోడలు సరళాదేవి (34), మనుమడు వివాన్ (3), ముకుందరావు చెల్లెలు అనిత (58), అనిత కూతురు రవళి (32), రవళి భర్త శివకుమార్ (38) వీరి కుమారుడు దీక్షిత్ (9)తోపాటు మరొకరు మరణించారు. ప్రమాదంలో మృతి చెందిన 8 మందిలో నగరంలోని అల్వాల్‌కు చెందిన నలుగురు, గొడేకికబ్‌ల్రో నివసించే ముగ్గురు ఉన్నట్లు పోలీసుల విచారణలో తే లింది. కాగా పుట్టినరోజు వేడుకల కోసం రెం డు కుటుంబాలకు చెందిన 32 మంది గో వాకు వెళ్లారని, వీరిలో 21 మంది ఓ కుటుంబానికి చెందిన వారు కాగా మరో 11 మంది మరో కుటుంబానికి చెందిన వారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయ కులు సహా మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు రక్షిం చి కలబురిగి పరిధిలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తర లించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కలబురిగి ఎస్‌పి ఇషా పంత్ తెలిపారు.
స్థానికుల కథనం మేరకు
గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కలబురిగి కమలాపూర్ దగ్గరికి రాగానే ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి కల్వర్ట్ కింద గుంతలో పడింది. ఈ క్రమంలో బస్సు కింద భాగంలోని డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు బస్సులోనే సజీవ దహనం కాగా మరో నలుగురు తీవ్ర గాయాలతో మరణించారు. ప్రమాద సమయంలో ప్రయాణీకుటు నిద్రలో ఉండగా బస్సు బోల్తాపడటం, మంటలు అంటుకోవడం అన్నీ ఏకకాలంలో జరిగినట్లు స్థానికులు వివరిస్తున్నారు. ప్రమాదం సంభవించగానే కొందరు బస్సు కిటికీల నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని, నలుగురు మాత్ర బయటకు రాలేక కాలి బూడిదైపోయారని స్థానిక పోలీసులు వివరిస్తున్నారు.
పుట్టిన రోజు వేడుకలకు
నగరంలోని అల్వాల్ చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్ వారి బాబు బర్త్ డే వేడుకల కోసం గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈక్రమంలో తన బంధు మిత్రులతో కలసి మే 29న గోవా వెళ్లారు. బస్సు తిరిగి వస్తున్న క్రమంలో కర్ణాటక కలబురిగి దగ్గర జరిగిన ప్రమాదంలో అర్జున్ కుమార్ తో పాటు అతని భార్య సరళాదేవి, బర్త్ డే బాయ్ వివాన్ సజీవదహనమయ్యారు. వారి పాప ప్రాణాలతో బయటపడింది. కొడుకు బర్త్ డేను బంధువులు, ఫ్రెండ్స్ మధ్య గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన ఎంతో సేపు నిలవలేదని, కొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటామనే లోపే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈక్రమంలో అర్జున్ కుమార్ కుటుంబం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం 26 మందికి గోవాకు వెళ్లేందుకు ఆరెంజ్ ట్రావెల్స్‌లో టిక్కెట్లు బుక్ చేశారని ఈ ట్రిప్ ప్లాన్ చేసిన అర్జున్ కుమార్, అతని భార్య ప్రమాదంలో చనిపోవడం విచారకరం. బసుస ప్రమాదం జరిగిన సమయంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో అల్వాల్, కూకట్ పల్లి, మణికొండ, షేక్ పేట్‌లకు చెందిన వారున్నారని ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతినిధులు వివరిస్తున్నారు. అర్జున్ కుంటుంబం ఏటా వెళ్లినట్టుగా ఈసారి కూడా విహారయాత్రకు వెళ్లారని కానీ అది ఓ పీడ కలలను మిగిల్చిందని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతీ ఏడాది రకరకాల ప్రదేశాలకు వెళ్లేవాళ్లమని ఈసారి అర్జున్ తన కుమార్తె పుట్టినరోజును గోవాలో జరిపేందుకు ప్లాన్ చేశాడని తెలిపారు. ముందుగా సొంత వాహనాల్లో వెళ్దామనుకుని కుదరక మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. నెల రోజుల ముందుగానే టూర్ ప్లాన్ వేసినట్టు బంధువులు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము టూర్ వెళ్లలేకపోయామని చివరికి ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఉద్వేగానికి లోనయ్యారు.
అల్వాల్‌లో విషాద ఛాయలు
కర్ణాటకలోని కాలబురిగి జిల్లా కమలాపుర వద్ద శుక్రవారం నాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో అల్వాల్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. కంటోన్మెంట్ పరిధిలోని బంజారా విలేజ్‌లో నివసించే రిటైర్డ్ సైనిక ఉద్యోగి ముకుందరావు తన బంధువుల కుటుంబాలతో గోవా విహారయాత్రకు ప్రయాణమయ్యారు. గోవా యాత్రను ఎంతో ఉత్సాహంగా ముగించుకొని మరో మూడు గంటల్లో ఇళ్లు చేరుతమనగా ప్రమాదం చోటు చేసుకోవడంతో అల్వాల్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ముకుందరావు కుటుంబం ఎప్పటికప్పుడు యాత్ర విశేషాలను ఇక్కడి బంధువులతో ఆనందాన్ని పంచుకుంటూ తిరుగు ప్రయాణంలో మృత్యుఒడిలోకి చేరుకోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం రాత్రి వరకు మృతురాలి సరళ భర్త రాజేశ్వరరావు కాలనీ అధ్యక్షుడు రాందాస్ శర్మకు గోవా యాత్రకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపి తమ అనుభవాలను పంచుకు-న్నాడ ని స్థానిక వాసులు విషాద వదనంతో తెలిపారు.
ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ
కర్ణాటకలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ సాయన్న, మాజీ బోర్డు సభ్యులు లోకనాథ్ జయ ప్రకాష్‌తోపాటు పలువురు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ జరిగిన సంఘటన ఎంతో విషాదకరమైనదని ప్రభుత్వం మృతి చెందిన వారికి మూడు లక్షలు, గాయపడిన వారికి యాభై వేలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా (కలబురగి)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సిఎం కెసిఆర్ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్నాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని క్షతగాత్రులైన వారికి సరియైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. కాగా ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియాను, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సిఎం ఆదేశించారు. ఆ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థివ దేహాలను వారి స్వస్థలానికి తరలించడం., క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.