Friday, January 24, 2025

ముస్లిం మహిళలపై కర్నాటక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వివాదాస్పద పోస్ట్!

- Advertisement -
- Advertisement -

రాయ్‌చూర్(కర్నాటక): ముస్లిం మహిళలు ‘పిల్లలను పుట్టించే కర్మాగారం’(బేబీ మేకింగ్ ఫ్యాక్టరీ) అంటూ కర్నాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త రాజు తుంబక్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. దాంతో అతడిని అరెస్టు చేశారు. రాజు తుంబక్ రాయ్‌చూర్‌లోని లింగాసుగుర్ పట్టణానికి చెందిన వ్యక్తి. అతడు తన వాట్సాప్ స్టేటస్‌లో గురువారం సాయంత్రం ముస్లిం మహిళలను కించపరిచేలా కార్టూన్ పెట్టాడు.

తుంబక్ పోస్ట్ ముస్లిం సముదాయంలోని అనేక మంది నుంచి నిరసనలు ఎదుర్కొంది. తుంబక్ వాట్సాప్ స్టేటస్‌లో ఉన్న ఆ కార్టూన్ వైరల్ కావడంతో ముస్లిం సముదాయానికి చెందిన సభ్యులు అతడిని అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం రాత్రి తుంబక్‌ను అరెస్టు చేశారు. అంతేకాక అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

పోలీసులు తుంబక్ మీద ఐపిసి 295(ఎ), 505(1)(సి) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతడిని మరింతగా విచారించేందుకు పోలీసులు అతడి కస్టడీని కోరనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News