Monday, December 23, 2024

సిద్ధరామయ్యను విమర్శించిన టీచర్ సస్పెండ్!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కొత్తగా ఎన్నికైన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, ఆయన పాలసీలను విమర్శించినందుకు ఓ ప్రభుత్వ టీచర్ సస్పెండ్ అయ్యాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఈ సస్పెన్షన్ అమలులోకి వచ్చింది.
అందిన వివరాల ప్రకారం చిత్రదుర్గ జిల్లాకు చెందిన టీచర్ శంతనమూర్తి ఎంజి. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో
“ ఎస్.ఎం. కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పు రూ. 3590 కోట్లు, ధరమ్ సింగ్, హెచ్‌డి కుమారస్వామి, బిఎస్.యెడియూరప్ప, సదానంద గౌడ, జగదీశ్ షెట్టర్ కాలంలో అప్పులు రూ. 15635కోట్లు, రూ. 3545 కోట్లు, రూ. 25653 కోట్లు, రూ. 9464 కోట్లు, రూ. 13464 కోట్లు ఉండినాయి. కానీ సిద్ధరామయ్య గత పదవీ కాలంలో అప్పు రూ. 242000 కోట్లను తాకింది. అందుకనే ఆయన ఉచితాలు ప్రకటిస్తున్నారు” అని రాశాడు.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న హొసదుర్గ తాలూకకు చెందిన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శంతనమూర్తికి సస్పెన్షన్ ఉత్తర్వును జారీ చేశారు. అందులో కర్నాటక సివిల్ సర్వీస్(ప్రవర్తన) నియమాలు1966ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. అంతేకాక ఓ డిపార్ట్‌మెంట్ ఇంక్వయిరీకి కూడా ఆదేశించారు.

సిద్ధరామయ్య మే 20న కర్నాటక 22వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిని చిత్తుగా ఓడించి అధికారాన్ని చేజిక్కించుకుంది. అసెంబ్లీలోని 224 సీట్లలో 135 సీట్లు గెలుచుకుంది. సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేపట్టాక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు గ్యారంటీలను ఆమోదించారు.

‘మేము ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన 165 వాగ్దానాలలో 158 నెరవేర్చాము. మేము మా హామీలను నిలబెట్టుకున్నాము. మేము మా హామీలతో పాటు ఇందిరా క్యాంటీన్, రుణ మాఫీ, విద్యశ్రీ, సౌభాగ్య, పశుభాగ్య వంటి 30 కొత్త పథకాలను అమలుచేశాము. వాటిని మేనిఫెస్టోలో అసలు పేర్కొనలేదు’ అని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News