Sunday, December 22, 2024

తండ్రిని చంపి 30 ముక్కలుగా నరికి… బోర్‌వెల్‌లో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తండ్రిని చంపి 30 ముక్కలుగా నరికి బోర్‌వెల్‌లో పడేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బాగల్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పరుశురామ్ కులాలీ(54) అనే వ్యక్తి ముదోలా ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. పరుశురామ్‌కు విఠల్ అనే కుమారుడు ఉన్నాడు. పరుశురామ్ మద్యానికి బానిస కావడంతో ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి. డిసెంబర్ 6న పరుశురామ్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుమారుడితో ఘర్షణకు దిగాడు. గొడవక తారాస్థాయికి చేరుకోవడంతో ఐరన్ రాడ్ తీసుకొని తండ్రి తలపై బాదాడు.

ఈ దాడిలో తండ్రి చనిపోవడంతో మృతదేహాన్ని గ్రామ శివారులోని తన పొలం వద్దకు తీసుకెళ్లాడు. మృతదేహాన్ని బోర్‌వెల్‌లోకి వేయడానికి ప్రయత్నించాడు. బోర్‌వెల్‌లో మృతదేహం పడకపోవడంతో డెడ్‌బాడీని 30 ముక్కలుగా నరికి బోర్‌వేల్‌లో పడేశాడు. బోర్ వేల్ నుంచి భరించరాని వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శరీర భాగాలను బయటకు తీశారు. గ్రామంలో ఎవరైనా అదృశ్యమయ్యారా? అని ప్రశ్నించారు. పరుశురామ్ డిసెంబర్ 6 నుంచి కనిపించడం లేదని తేలడంతో అతడి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో విఠల్ నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News