Monday, December 23, 2024

భార్య, ప్రియుడ్ని చంపి…. ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భార్య, ప్రియుడిని హత్య చేసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కోణనకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోల్లబాబు(45), లక్ష్మీ పైతమ్మ(40) అనే దంపతులు కొన్ని రోజులుగా బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ దంపతులతో పాటు గణేశ్ కుమార్ అనే యువకుడు కూడా భవన కార్మికురాలుగా పని చేస్తున్నాడు. ముగ్గురు సోమేశ్వర లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న భవనంలో నివాసం ఉంటున్నారు. పైతమ్మ, గణేశ్ మధ్య వివాహేతర సంబంధం ఉందని గొల్లబాబుకు తెలియడంతో పలుమార్లు భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్య వివాహేతర సంబంధంతో గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి భార్య, ఆమె ప్రియుడి తలపై భర్త కర్రతో మోదీ హత్య చేశాడు. అనంతరం తన మరదలకు ఫోన్ లో సమాచారం ఇచ్చి భర్త ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News