- Advertisement -
బెంగళూరు: పెళ్లి కావడంలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని విరాజ్ పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోయగిరిలో దిలీప్ అనే యువకుడు నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా పెళ్లి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఎక్కడ పెళ్లి సంబంధం కుదరకపోవడంతో విపరీతంగా బాధపడుతున్నాడు. పెళ్లి జరగడంలేదనే బాధతో దిలీప్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -