Tuesday, January 7, 2025

భార్య వేధిస్తుందని పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెళుగుప్ప ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దుద్దేకుంట గ్రామానికి చెందిన ఆవుల అనిల్ అనే యువకుడు మోటార్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. హావళిగి గ్రామానికి చెందిన గీతను సంవత్సరం క్రితం అనిల్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి అనిల్‌తో గీత గొడవ పడుతుండడంతో పలుమార్లు పెదమనుషుల సమక్షంలో గొడవ జరిగింది.

అత్తామామ ఉన్నప్పుడు తనతో మంచిగా ఉంటుందని, ఇంట్లో ఎవరు లేనప్పుడు తన టార్చర్ చేస్తుందని వాపోయాడు. ఇటీవల దంపతులు మధ్య గొడవ జరగడంతో అనిల్ భరించలేకపోయాడు. గంగవరం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. భార్య వేధింపులకు గురి చేయడంతో పాటు తనతో సరిగా ఉండడం లేదని వాట్సాప్ స్టేటస్ పెట్టి అనిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అనిల్ సోదరుడు రాము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News