Friday, January 24, 2025

ప్రియురాలికి పెళ్లి…. కుంటలో పడి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వేర్వేరు కులాలు కావడంతో ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో ప్రియుడు, ప్రియురాలు కలిసి నీళ్ల కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం చింతామణి తాలూకలోని కెంచారహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత రెండు సంవత్సరాల నుంచి వేణు(21), అనూష్క(19) ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం అనుష్క కుటుంబ సభ్యులకు తెలియడంతో చౌడరెడ్డి అనే యువకుడి ఇచ్చి మే 25న యువతి పెళ్లి చేశారు. ఆషాడమాసం నేపథ్యంలో అనూష్క తన అత్తగారింటి నుంచి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చింది. ఈ నెల 12న బాగేపల్లి వెళ్లి వస్తానని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో చెపి అనూష్క బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు ఎక్కడి వెతికినా అచూకీ లభ్యం కాలేదు. దీంతో ఇద్దరు పారిపోయి ఉంటారని అనుమానం కూడా ఇరు కుటుంబ సభ్యులకు కలిగింది. చౌడరెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమి వద్ద నీటి కుంట సమీపంలో మొబైల్ ఫోన్లు, చెప్పులు, పర్సులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కుంట వద్దకు చేరుకొని నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News