Monday, December 23, 2024

అన్న కుమారుడిని తుపాకీతో కాల్చి… సోదరుడిని నరికి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అన్నపై పదునైన ఆయుధంతో దాడి చేసి అనంతరం ఆయన కుమారుడిని బాబాయ్ తుపాకీతో కాల్చి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం గుడిబండే తాలూకాలో జరిగింది. హంపసంద్ర గ్రామంలో నజీర్ అహ్మద్(46) అనే వ్యక్తి తన తండ్రి మాసూసాబియా, తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. గతంలో నజీర్ అహ్మద్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా పని చేశారు. నజీర్ కుటుంబానికి, ఆయన పిన తండ్రి బషీర్ అహ్మద్‌కు మధ్య భూతగాదాలు ఉన్నాయి. బషీర్ ఈ మధ్యనే గల్ఫ్ నుంచి గ్రామానికి వచ్చారు. పాత పగ నేపథ్యంలో మాసూసాబియాపై బషీర్ పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అనంతరం బయటకు వస్తుండగా నజీర్ కనిపించడంతో అతడిపై బషీర్ కాల్పులు జరపడంతో అక్కడే మృతి చెందాడు. మాసూసాబియా తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News