Sunday, December 22, 2024

ఎల్లమ్మ గుడికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం హవేరి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుండెనహళ్లి శివారులోని పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొట్టడంతో 13 మంది చనిపోయారు. నలుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని ఈమ్మహట్టి గ్రామానికి చెందిన 17 మంది భక్తులు బెళగావి ప్రాంతం శవదత్తిలోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులలో పరుశురామ్(45), భాగ్య(40), నాగేశ్(50), విశాలక్షి(50), సుభద్రా బాయ్(65), పుణ్య(50), మంజుల బాయ్(57), డ్రైవర్ అదర్ష్(23), మానస(24), రూపా(40), మంజుల(50), ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News