Monday, December 23, 2024

ప్రేమించుకున్నారు… పెళ్లి జరిగిన రోజే వేటకొడవళ్లతో నరుక్కున్న నవ దంపతులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన రోజు ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు వేట కోడవళ్లతో నరుక్కున్నారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా కెజిఎఫ్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బైనహళ్లి గ్రామంలో శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు కూతురు లిఖిత శ్రీ(19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. ఎపి రాష్ట్ర చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం సంతూరు గ్రామానికి చెందిన మునియప్ప కుమారుడు నవీన్ కుమార్(27) దుస్తులు అమ్మే షాపులో పని చేస్తున్నాడు. నవీన్ కుమార్, లిఖిత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం ఇంట్లో వాళ్లను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు ఇద్దరు ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు అరుపులు కేకలు రావడంతో బంధువుల బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా రక్తపు మడుగులో కనిపించారు. ఇద్దరు గదిలో ఉన్న వేటకొడవళ్లతో దాడి చేసుకున్నట్టు బంధువులు గుర్తించారు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో లిఖిత చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అతడు కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇధ్దరు ఒకరంటే ఒకరికి ప్రాణమని, ఇష్టం ఉండడంతోనే పెళ్లి చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు మధ్య సీక్రెట్స్ ఉన్న ఒకరు బయటపెట్టడంతోనే గొడవ జరిగి హత్య చేసుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News