Monday, December 23, 2024

ప్రియురాలిని దాచిపెట్టారని…తల్లిదండ్రులపై ప్రియుడు దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తాను ప్రేమించిన అమ్మాయిని వేరే గ్రామానికి పంపించడంతో ఆమె తల్లిదండ్రులపై ప్రియుడు దాడిచేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం రాయచూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సింధనూరు తాలూకాలోని ఆర్‌హెచ్ క్యాంప్-3లో ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కూతురును బంధువుల ఇంటికి పంపించారు. ప్రియుడు ప్రణవ్‌కు ఈ విషయం తెలియడంతో ఆగ్రహం రగిలిపోయాడు. ఈ నెల 14న తన అనుచరులతో కలిసి ప్రియురాలి తల్లి శ్రుతి మండల్, ప్రియుడు హీరా మోహన్, సోదరుడు హిమాంశుపై మారణాయుధాలతో దాడి చేశారు. స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News