Wednesday, January 22, 2025

రూ. 58 లక్షల జాబ్ ఆఫర్ దక్కించుకున్న కర్నాటక విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో సాధించిన ర్యాంకుకు ఎన్‌సి కీర్తికి మంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సీటు వచ్చేది..కాని అంత ఫీజులు భరించలేని ఆమె ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుతూ ఏడాదికి రూ. 58.3 లక్షల వేతన ప్యాకేజ్‌తో ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకుంది. కర్నాటకలోని వెనుకబడిన తుమకూరు జిల్లాలోని మధుగిరికి చెందిన కీర్తికి కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఇంత భారీ వేతనంతో ఉద్యోగ అవకాశాన్ని అందచేసింది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 106 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ ఇంజనీరింగ్ కళాశాలలో 2019లో ఇద్దరు విద్యార్థులకు ఏడాదికి రూ. 49.75 లక్షల చొప్పున జాబ్ ఆఫర్ లభించగా ఆ రికార్డును కీర్తి ఈ ఏడాది అధిగమించింది.

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చివరి సెమిస్టర్ చదువుతున్న కీర్తి ఈ ఏడాది ఆగస్టులో ఫైనల్ ఎగ్జామ్స్ రాయనున్నది. ఆమెకు జాబ్ ఆఫర్ ఇచ్చిన కంపెనీయే ప్రస్తుతం ఆమెకు ఆరు నెలల ఇంటర్న్‌షిప్ కింద నెలకు రూ. 1 లక్ష అంద చేస్తోంది. తనకు మంచి ఉద్యోగం వస్తుందని ఆశించాను కాని ఇంత భారీ ప్యాకేజ్‌తో ఆఫర్ వస్తుందని ఊహించలేదని కీర్తి తెలిపింది. కీర్తి తండ్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచరుగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. 12వ తరగతి, 10వతరగతి చదువుతున్న ఇద్దరు చెల్లెళ్లు కీర్తికి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News