Monday, December 23, 2024

బాణసంచా గోదామ్ లో అగ్నిప్రమాదం: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో బాణసంచా గోదామ్‌లో శనివారం రాత్రి అగ్ని ప్రమదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  బాణసంచాలను లారీ, మినీ గూడ్స్ లో శ్రీ బాలాజీ ట్రేడర్స్ షాపులో ఆన్ లోడింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా తమిళనాడులోని శివ కాశీ నుంచి హోల్ సేల్ షాపు కు ట్రాన్స్ పోర్టు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.   ఈ ప్రమాదంపై సిఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం సిఎం సిద్ధరామయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించనున్నారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. బాణసంచా గోదామ్‌కు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News