Sunday, September 8, 2024

మోడీ 5 స్టార్ హోటల్ బిల్లు మేమే చెల్లిస్తాం: కర్నాటక మంత్రి

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పులుల పరిరక్షణ సంస్థ(ఎన్‌టిసిఎ) నిర్వహించిన ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో మైసూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్ బిల్లు బకాయిలు రూ. 80 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సోమవారం వెల్లడించారు. రాడిసన్ బ్లూ హోటల్‌కు చెల్లించాల్సిన బిల్లులను గురించి ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్నాటకలో ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న సమయంలో ఎన్‌టిసిఎ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగిందని ఆయన చెప్పారు.

ఆ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీ బస చేసిన హోటల్ బిల్లును చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలకు రూ. 33 కోట్లు ఖర్చు కాగా ఎన్‌టిసిఎ రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంలో ఎన్‌టిసిఎకి రాష్ట్ర అటవీ శాఖ అధికారులు సహాయపడ్డారని, అయితే బిల్లులను చెల్లించాల్సిందిగా ఆ హోటల్ అటవీ శాఖకు లేఖ రాసిందని, ఈ గందరగోళానికి తెరదింపేందుకు తామే ఆ బిల్లులను చెల్లిస్తామని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News