Sunday, December 22, 2024

కర్నాటకలో వీడియో ప్రకంపన.. బిజెపి మహిళా కార్యకర్త అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో ఓ కాలేజీలో బాత్రూం వీడియో ఇప్పుడు ఓ బిజెపి మహిళా కార్యకర్త అరెస్టుకు దారితీసింది. మహిళా కార్యకర్త శకుంతల సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా పరుషపదజాలపు వ్యాఖ్యలు పెట్టారని అరెస్టు చేశారు. బాత్రూం వీడియో చిన్న సంఘటన అని, పెద్దగా చిత్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నేత చేసిన ట్వీటును ఈ బిజెపి కార్యకర్త తమ సోషల్‌మీడియా పోస్టింగ్‌లో జతచేసి పెట్టారు. ఈ దశలో ముఖ్యమంత్రి కూతురికో, కోడలుకే ఈ బాత్రూం ఘటన ఎదురైతే ఏం చేస్తారని వ్యంగ్యంగా నిలదీయడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యల పరిధిలో కేసు దాఖలు కావడంతో స్థానిక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News