బెంగళూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పండంటి బిడ్డను ప్రసవించిన సంఘటన కర్నాటకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుమకూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షయల్ పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. కడుపులో నొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా కడుపులో బిడ్డ ఉందని గుర్తించడంతో పాటు ఎనిమిది నెలల అని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. నొప్పులు ఎక్కువ కావడంతో మగ బిడ్డకు బాలిక జన్మనిచ్చింది. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సీనియర్ విద్యార్థి పేరు చెప్పింది. సదరు విద్యార్థి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను కాదని చెప్పడంతో మరో విద్యార్థి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పించారు. బాలిక చెబుతున్న మాటల్లో నిలకడలేకపోవడంతో విచార చేసి బాధ్యులిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వార్డెన్ ను సస్పెండ్ చేశారు.
బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి బాలిక… కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -