Tuesday, December 3, 2024

కారును ఢీకొట్టిన ట్రక్కు… 8 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చండికా దుర్గా పరమేశ్వరి ఆలయంలోకి వెళ్లేందుకు NH-66పై రివర్స్‌ తీసుకుంటుండగా కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఎనిమిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇన్నోవా కారులో ఉన్నవారు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో డిసిఎం డ్రైవర్ కూడా ఉన్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News