Monday, January 20, 2025

కూతురు నగ్న చిత్రాలు, వీడియోలు వాట్సప్‌లో షేర్ చేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కన్న తండ్రి తన కూతురు నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో తండ్రిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం ఉడుపి ప్రాంతంలోని పడుబిద్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తీర్థహళ్లికి చెందిన తౌషిఫ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. సదరు యువతి తండ్రికి ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో తౌషిఫ్‌పై దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. యువకుడి ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలను తన ఫోన్‌లోకి పంపించుకున్నాడు. వెంటనే ఆ ఫొటోలను తన స్నేహితుల వాట్సప్ గ్రూపులోకి ఫోస్టు చేయడంతో భార్య నిలదీసింది. దీంతో భార్యపై కూడా భర్త దాడి చేశాడు. ఈ విషయం కూతురుకు తెలియడంతో యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆమెను సరైన సమయంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో భయటపడింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News