Monday, December 23, 2024

బాలుడిని కాపాడుదామని… ఐదుగురు నీళ్లలో మునిగి మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఒకరిని కాపాడుదామని చెప్పి ఐదుగురు నీళ్లలోకి దిగి మునిగిపోయి చనిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మౌలానా అహ్మద్ సలీం కలీల్(44) తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వివాహారయాత్రకు వెళ్లాడు. 25 మంది శిరసి నుంచి శాల్మలా నది తీరానికి వచ్చారు. భూతనంగడి వద్ద ఒక కుటుంబంలోని బాలుడు నదిలో పడిపోవడంతో అతడిని కాపాడడానికి మౌలానా నీళ్లలోకి దిగాడు. బిడ్డను ఒడ్డుకు చేర్చే క్రమంలో తల్లి నాదియాకు అందించాడు. బిడ్డను ఒడ్డుకు చేర్చి మౌలానాకు చేయి అందించే ప్రయత్నంలో ఆమె నీళ్లలో పడిపోయింది. వారిద్దరినీ రక్షించే క్రమంలో మరో ముగ్గురు నీళ్లలోకి మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశాయి. మృతులు నబిల్ నూర్ అహ్మద్ షేక్(22), మౌలానా అహ్మద్ సలీం కలీల్(44), నాదియా నూర్ మహ్మద్ షేక్(20), ఉమర్ సిద్ధిక్ (23), మిస్పాతబసుమ్(21) లుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News