Thursday, December 19, 2024

కర్నాటకలో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతూ వీరశైవ లింగాయత్ ఫోరం అధికారిక లేఖ!

- Advertisement -
- Advertisement -
కర్నాటక ఎన్నికల్లో లింగాయత్ ఓట్లు నిర్ణయాధికారం కలిగి ఉంటాయి

హుబ్బలి: కర్నాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్నాటక వీరశైవ లింగాయత్ ఫోరం మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని కీలకమైన లింగాయత్‌ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్‌కు ఇది ప్రోత్సాహకం అని భావించవచ్చు. ఆ ఫోరమ్ కాంగ్రెస్‌కు మద్దతునిస్తూ అధికారిక లేఖను విడుదలచేసింది.

మే 5న కాంగ్రెస్ నాయకుడు, లింగాయత్ ప్రముఖ నాయకుడు జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరేందుకు హుబ్బలిలో కూమ్యూనిటీకి చెందిన జానులతో సమావేశమయ్యారు. బిజెపి టికెట్ ఇవ్వ నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి షెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు. డిప్యూటీ సిఎంగా పనిచేసిన లక్ష్మణ్ సవాది సైతం లింగాయత్ వర్గానికి చెందినవారే. వీరు కాంగ్రెస్‌లో చేరడమన్నది కర్నాటక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నది. సాధారణంగా లింగాయత్‌లు కర్నాటకలో నిర్ణయాత్మక ఫలితం ఇస్తారు. వారి కమ్యూనిటీ ఇన్నాళ్లు బిజెపి వైపు ఉండింది. కాగా ఇప్పుడు వీరశైవ లింగాయత్ ఫోరం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో కర్నాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

లింగాయత్‌లు ఉత్తర కర్నాటకలోని బెల్గావి, ధార్వాడ్, గడగ్ జిల్లాల్లో బలంగా ఉన్నారు. అంతేకాక వారు బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయిచూర్‌లలో కూడా గణనీయంగానే ఉన్నారు. ఇక కర్నాటక దక్షిణంలో బెంగళూరు, మైసూరు, మాండ్యలలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

కర్నాటకలోని 224 అసెంబ్లీ సీట్లకు మే 10న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. కాంగ్రెస్ ఈసారి గణనీయ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News