Monday, January 20, 2025

కర్ణాటక విధాన సౌధ ఆవు మూత్రంతో శుద్ధి

- Advertisement -
- Advertisement -

బెంగళూర్ : కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలనకు చరమగీతం పాడడమైందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధాన సౌధను గోమూత్రంతో శుద్ధి చేశారు. శనివారం ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య ప్రమాణస్వీకారం చేసిన తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. బీజేపీ తన అవినీతితో అసెంబ్లీని కలుషితం చేసిందని, కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది.

డిప్యూటీ సిఎంగా ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఏడాది జనవరిలో విధాన సౌధను గోమూత్రంతో శుభ్రపరిచే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. “విధాన్ సౌధను శుభ్రం చేయడానికి కొంత డెట్టాల్‌తో వస్తాం. నా దగ్గర శుద్ధి చేయడానికి కొంత ఆవుమూత్రం కూడా ఉంది” అని కూడా శివకుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News