Friday, December 20, 2024

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతడి తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 12 సంవత్సరాల క్రితం హోటగళ్లి గ్రామానికి చెందిన మంజు(37), బోగాది ప్రాంతానికి చెందిన లిఖితతో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాత లిఖిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. పెద్దలు భర్తకు నచ్చజెప్పి అత్తగారింటికి లిఖితను పంపించారు. లిఖిత వివాహేతర సంబంధం బయటపడడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో చంపేయాలని భార్య నిర్ణయం తీసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న భర్తను భార్య తన ప్రియుడితో కలిసి గొంతునులిమి చంపేసింది. అనంతరం తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని శోకాలు పెట్టింది. భర్త బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News