Sunday, February 2, 2025

ఫిర్యాదు చేద్దామని వెళ్తే పోలీసుల వేధింపులు…. యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే యువతిని పోలీసులు వేధించడంతో ఆమె వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం రామనగరా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాధురి(31) అనే యువతి చెన్నపట్నంసిటీలోని కోట్ లేఔట్‌లో నివసిస్తున్నారు. నగదు విషయంలో మరొకరితో గొడవ జరగడంతో మాధురి చెన్నపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేయలేదు. గతంలో ఆమెపై పలు చీటింగ్ కేసులు ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మనస్థాపం చేందిన ఆమె ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తనని వేధించారని వీడియో రికార్డు చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు ఎస్‌పికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై చెన్నపట్నం ఇన్స్‌పెక్టర్ శోభ, ఇతర సిబ్బందిపై ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News