Sunday, November 3, 2024

సోషల్ మీడియాలో రచ్చ… మహిళా సివిల్ సర్వెంట్లపై బదిలీ వేటు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సామాజిక మాధ్యమాల్లో దూషణలకు దిగిన ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్లపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు మహిళా అధికారులను ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. రూపా మౌద్గిల్ భర్త మునీష్ మౌద్గిల్ (ఐఎఎస్)ను కూడా బదిలీ చేసింది.

ఇప్పటివరకు రెవెన్యూ విభాగంలో కమిషనర్‌గా ఉన్న ఆయనను డీపీఎఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఇద్దరు మహిళా అధికారులపై చర్యలు ఉంటాయని కర్ణాటక హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర హెచ్చరించిన మరుసటి రోజే ఈ బదిలీలు చోటు చేసుకోవడం గమనార్హం. ఐఎఎస్ అధికారిణి రోహిణీ సింధూరీ , ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్‌ల మధ్య సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చోటు చేసుకున్న వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

పరస్పర వీరి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఇరువురు మహిళా అధికారులు చీఫ్ సెక్రటరీ వందితాశర్మకు పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకున్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై… అఖిల భారత సర్వీస్ నిబంధనలకు కట్టుబడి ఉండాలంటూ ఇద్దరు మహిళా అధికారులకు చీఫ్ సెక్రటరీ మౌఖికంగా , లిఖిత పూర్వకంగా సూచించారని అన్నారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో మహిళా ఉన్నతాధికారుల దూషణల తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యం లో కర్ణాటక ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News