- Advertisement -
ఒక ప్రవాస భారతీయ మహిళపై అత్యాచారానికి పాల్పడిన యోగా టీచర్ ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. గత జన్మలో మన ఇద్దరి సంబంధం ఉందన్న సాకుతో ఆ మహిళను లోబరుచుకున్న యోగా టీచర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై మల్లనహల్లిలోని కేవల ఫౌండేషన్‌కు చెందిన యోగా గురు ప్రదీప్ ఉల్లల్(54)పై కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారు. పంజాబ్‌కు చెందిన బాధిత మహిళ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. 2021, 2022 మధ్య తాను మూడుసార్లు యోగా గురును కలుసుకున్నానని, ఆ సమయంలోనే తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె ఫిర్యాదు చేశారు.
- Advertisement -