Wednesday, January 22, 2025

రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఇన్‌స్టాగ్రామ్ వీడియో చేస్తూ ఒక 23 ఏళ్ల యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కర్నాటకలోని ఉడుపి జిల్లా బైందూర్ వద్ద అరిషినగుండి జలపాతం వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

శివమొగ్గ జిల్లాలోని భద్రావతికి చెందిన శరత్ కుమార్ అనే యువకుడు జలపాతం సమీపంలో ఒక బండరాయిపై నిలబడి రీల్స్ చేస్తుండగా అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. శరత్ మిత్రుడు వెనుక నుంచి వీడియో రికార్డు చేస్తుండగా ఈ ఘటనచోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శరత్ హఠాత్తుగా నీటిలో పడిపోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తూ వరదలు పోటెత్తుతున్నాయి. నదులు, వాగులు, వంకెలు జలకళను సంతరించుకోవడంతో పెద్దసంఖ్యలో పర్యాటకులు జలపాతాలు ఉన్న ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News