Saturday, January 25, 2025

ఆయన.. పేదల కోసం జీవితాన్ని అంకితం చేశారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  భారతరత్న కర్పూరి ఠాకూర్.. పేదల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద కిషన్ రెడ్డి, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. తర్వాత బీజేపీ-2025 డైరీని కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో కర్పూరి ఠాకూర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. సోషలిస్టు నాయకుడిగా విద్యార్థి దశలోనే కర్పూరి అనేక పోరాటాలకు రూపకల్పన చేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. బిహార్‌కు విద్యాశాఖ మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని.. అప్పట్లోనే విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News