‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది శ్రీలీల. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే కొద్దిరోజులుగా శ్రీలీలకు సంబంధించిన ఓ రూమర్ బాగా వైరల్ అవుతోంది. ఓ బాలీవుడ్ హీరోతో ఆమె డేటింగ్‌లో ఉందని త్వరలో వాళ్లు వివాహం కూడా చేసుకుంటున్నారని వార్త చక్కర్లు కొడుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. కార్తీక్ ఆర్యన్.
శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరో కావడం విశేషం. ఈ షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మరిందని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం శ్రీలీల, కార్తీక్ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ పార్టీలో పాల్గొనడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇదిలా ఉండగా.. కార్తీక్, శ్రీలీల ప్రేమను కార్తీక్ తల్లి దాదాపుగా ధృవీకరించారు.
ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఎలాంటి కోడలు కావాలో అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ఒక మంచి డాక్టర్ కోడలిగా వస్తే బాగుంటుంది’ అని అన్నారు. శ్రీలీల యాక్టింగ్‌తో పాటు ఎంబిబిఎస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కార్తీక్ తల్లి డాక్టర్ కోడలిగా రావాలని కోరుకోవడం చూస్తే.. వీరిద్దరి మ్యారేజ్ పక్కా అని ఆమె కన్ఫమ్ చేసినట్లు అనిపిస్తుంది.