Thursday, January 23, 2025

నాలుగు గ్యాంగ్‌ల చుట్టూ తిరిగే కథ ‘ఛాంగురే బంగారురాజా’..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్ వర్క్‌లో మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించారు. కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. సినిమా విడుదల సందర్భంగా హీరో కార్తీక్ రత్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఛాంగురే బంగారురాజా’. కామెడీ, థ్రిల్, యాక్షన్ అన్నీ వుంటాయి. కుటుంబం అంతా కలసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూడదగ్గ చిత్రమిది. చాలా నవ్విస్తుంది. ఈ సినిమాలో నాలుగు గ్యాంగ్‌లు వుంటాయి.

దాదాపు సినిమా అంతా గ్యాంగ్‌ల ఛేజింగ్ వుంటుంది. ఆ వెంటపడటంలో కూడా కామెడీ వుంటుంది. రవితేజ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా చేయడంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో హీరో, విలన్ అని కాకుండా ప్రతి పాత్రలో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ వుంటాయి. రవి బాబు, సత్యతో పాటు మిగతా పాత్రలన్నీ చాలా హిలేరియస్‌గా వుంటాయి. ఇందులో నేను చేసిన బంగారురాజు పాత్ర చాలా కమర్షియల్. డబ్బులు ఇస్తేనే పని చేసే రకం. ఇక రవితేజకి సినిమా చాలా నచ్చింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News