Monday, December 23, 2024

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘జిగర్ తండా 2’..

- Advertisement -
- Advertisement -

కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న చిత్రం ‘జిగర్ తండా 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలియజేశారు. 2014లో ఆయన రూపొందించిన యాక్షన్ కామెడీ ‘జిగర్ తండా’ బేస్డ్‌గా ‘జిగర్‌తండా 2’ రూపొందనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ‘జిగర్ తండా 2’లో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాను 2023లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News