Sunday, December 22, 2024

కొండెక్కిన కోడి గుడ్డు..

- Advertisement -
- Advertisement -

నిన్నమొన్నటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న కోడి గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. ఇకనుంచి ప్రజలకు చుక్కలు చూపించేందుకు రెడి అయ్యింది కోడి గుడ్డు. మంగళవారంతో కార్తీకమాసం ముగుస్తుండడంతో కోడిగుడ్డు ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతోంది. మార్కెట్ లో ఒక్కో గుడ్డు ధర రూ.7లకు లభిస్తుంది. హోల్ సెల్ లోనే గుడ్డు ధర దాదాపుగా ఈ రూ.6 పలుకుతుంది. పోషకాల కేరాఫ్ అడ్రస్ అయిన గుడ్డు అందనంత ఎత్తుకు ఎగరడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

కార్తికాసం కారణంగా ప్రజలు నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. గుడ్డు కూడా ముట్టకుండా భక్తిశ్రద్ధలతో ప్రజలు ఉన్నారు. దీంతో చికెన్ ధరలు భారీగా దిగొచ్చిన విషయం తెలిసందే. ఇక, నేటితో కార్తికమాసం ముగిస్తుండడం, రానున్నరోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండడంతో చికెన్ ధరలు కూడా భారీగా పెరిగొచ్చంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News