- Advertisement -
కార్తీక పౌర్ణమి రెండో సోమవారం సందర్భంగా శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. పుణ్య స్నానాలు చేసి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్నారు. స్వామివారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీగా భక్తులు తరలివస్తుండడంతో ఆలయంలో సందడి నెలకొంది.
ఇక, శ్రీశైలం మల్లన్న ఆలయానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక, విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలోనూ భక్తుల తాకిడి నెలకొంది.
- Advertisement -