Monday, December 23, 2024

13న వస్తున్న ‘కార్తికేయ 2’

- Advertisement -
- Advertisement -

Karthikeya 2 Movie to release on Aug 13

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్‌లపై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘కార్తికేయ్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 13న విడుదల కానుంది ‘కార్తికేయ 2’. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ “ఈ సినిమా ట్రైలర్ 1కు మంచి స్పందన వచ్చింది. థియేటర్ ద్వారా ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వాలని తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు మంచి లొకేషన్స్ ఎంపిక చేసుకొని గ్రీస్, గుజరాత్, కాశ్మీర్ తదితర అనేక ప్రదేశాలలో తీశాము. ఇప్పుడే మా సినిమా ఓటిటిలో రాదు. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్స్‌కు వచ్చి చూడండి. ఇక ఈనెల 6న సినిమా ట్రైలర్ 2ను రిలీజ్ చేస్తున్నాము”అని అన్నారు.

చిత్ర నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో, మంచి విజువల్స్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పారు. ఈ చిత్ర మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ “శ్రీకృష్ణుడును ప్రేరణగా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. దర్శకుడు చందు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నిఖిల్, అనుపమతో సహా అందరూ నటీ నటులు చాలా బాగా చేశారు”అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ “ఒక మంచి కాన్సెప్ట్‌ను నమ్మి తీసిన ఈ సినిమాకు ప్రేక్షకుల ప్రోత్సాహం ఉండాలి. ఈనెల 13న వస్తున్న మా ‘కార్తికేయ 2‘ సినిమా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సహ నిర్మాత వివేక్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, సత్య , వైవా హర్ష, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

‘Karthikeya 2’ Movie to release on Aug 13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News