Monday, December 23, 2024

అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్.. (‘కార్తికేయ 2’ ట్రైలర్)

- Advertisement -
- Advertisement -

Karthikeya 2 Trailer launch

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘కార్తికేయ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్స్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్‌కి జంటగా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘కార్తికేయ 2’.

Karthikeya 2 Trailer launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News