Monday, December 23, 2024

నాటు నాటుకు ఆస్కార్ రావడానికి కారణం అతడే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వరించింది. రాజకీయ, సినీ ప్రముఖులు టాలీవుడ్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నాటు నాటు సాంగ్ గురించే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాటు నాటు సాంగ్‌కు గొల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడే దాని ప్రాముఖ్యత ఏంటి అనేది తెలిసింది. నాటు నాటు సాంగ్‌కు మార్కెటింగ్ ఎవరు చేశారు. ఆస్కార్ అవార్డు దాకా వెళ్లడానికి దానికి కావాల్సిన అర్హతలు ఏమిటీ… దేనికి పడితే దానికి అవార్డులు ఇస్తారా? అనేది ప్రశ్నగా ఉంది. కీరవాణి ఆస్కార్ అవార్డు తీసుకునేటప్పుడు దీని వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు కార్తికేయ.

ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషనల్‌లో భాగంగా జూనియర్ ఎన్‌టిఆర్ కార్తీకేయ పేరును బయటకు తీయడంతో వీరుడు, శూరుడు అని ప్రశంసించాడు. కార్తీకేయ ఏం చేశాడు, ఏలా చేశాడు.. అసలు ఆయన ఎవరు… కార్తీకేయ రాజమౌళి దత్త పుత్రుడు… రాజమౌళి భార్య రమ మొదటి భర్తకు జన్మించిన వాడే కార్తీకేయ. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి కథ, రచన, పాటలను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డు వరకు కార్తికేయ తెలివితేటలు కనిపిస్తాయి. ఆర్‌ఆర్‌ఆర్ మార్కెటింగ్ ప్రపంచంలో వివిధ దేశాలలో ప్రదర్శన, డబ్బు లెక్కలు అని కార్తికేయ చూసుకునేవాడు.

తాను మార్కెటింగ్ జీనియస్, ఒక ముక్కలో చెప్పాలంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు వెన్నెముక లాంటి వాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో బయట ప్రపంచానికి రామ్‌చరణ్, ఎన్‌టిఆర్,రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ కనిపించే సింహాలు అయితే కనిపించని సింహం కార్తికేయ. కార్తికేయ లేకపోతే ఆస్కార్ అవార్డు ముంగిట్లో అడుగుపెటేవాడే కాదు. ఇక్కడ ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ఎంత డబ్బు ఖర్చు పెట్టిన విషయం పరిగణనలోకి రాదు, కెజిఎఫ్, బాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలు డబ్బులు పెట్టలేరా? అనేది సమస్య కాదు. సరైన మార్గంలో ప్రయాణించి ఆస్కార్ చేరుకోవడమనేది కార్తికేయ గొప్పతనాన్ని సూచిస్తుంది. ఎక్కువ సంతోషం వ్యక్తం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే రాజమౌళి భార్య రమ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News