Thursday, January 23, 2025

‘జపాన్’ సినిమా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

విలక్షణమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ వినోదాత్మక చిత్రాలు అందించడంలో హీరో కార్తి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం హీరో కార్తి ప్రతిష్టాత్మక చిత్రం ‘జపాన్’ కోసం డ్రీమ్‌వారియర్ పిక్చర్స్‌తో జతకలిశారు. వినోదంతో పాటు సామాజిక విలువలతో చిత్రాలు అందించే రాజు మురుగన్ ’జపాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు- డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రాజు మురుగన్ కాంబినేషన్‌లో వచ్చిన ’జోకర్’ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కార్తి ’జపాన్’ కోసం రాబోతోంది. కార్తికి ఇది 25వ సినిమా కావడం మరింత విశేషం. ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ జోడీ కడుతోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో మంగళం శీను పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు మంగళవారం ఉదయం గ్రాండ్‌గా జరిగాయి. త్వరలోనే తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Karthi’s ‘Japan’ Movie pooja ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News