Monday, December 23, 2024

విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుత నటన

- Advertisement -
- Advertisement -

హీరో కార్తి, ‘అభిమన్యుడు’ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ల తాజా చిత్రం ’సర్దార్’ బ్రిలియంట్ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సైనిక సమాచారం ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా, సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరగా అది ఎవరికి చిక్కింది, అందులో వున్న రహస్యాలు ఏమిటనేది ఇందులో కధాంశంగా ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. పిఎస్ మిత్రన్ అద్భుత కథనం, కెమెరామెన్ జార్జ్ సి విలియమ్స్ బ్రిలియంట్ విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ లైవ్ స్కోర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తి అభినయం అద్భుతంగా వుంది. విభిన్న షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. రాశీ ఖన్నా, రజిషా విజయన్, లైలా కూడా ట్రైలర్‌లో కనిపించి సినిమాపై అంచనాలు పెంచారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. దీపావళి కానుకగా ఈనెల 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది.

Karthi’s Sardar Movie Trailer Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News