Monday, December 23, 2024

చైనీయులకు వీసాల కేసు.. ఇడి ఎదుట హాజరైన కార్తీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం శుక్రవారం ఇక్కడి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరయ్యారు. నెలలో ఆయన ఇడిఎదుటికి రావడం ఇది మూడోసారి. 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీ చేయడంలో కార్తీ చిదంబరం మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో సమన్లకు ఆయన హాజరవుతున్నారు. పిఎంఎల్‌ఎ పరిధిలో ఈ 52 ఏండ్ల ఎంపిని గత ఏడాది డిసెంబర్ 23న తరువాత ఈ నెల 2వ తేదీన ఏజెన్సీ ప్రశ్నించింది. ఆయన వాంగూల్మం నమోదు చేసింది.

తమిళనాడులోని శివగంగ ఎంపి అయిన కార్తీ విదేశీయులకు అక్రమ లావాదేవీల తరహాలో వీసాలు మంజూరు చేశారనే అభియోగాలతో శుక్రవారం ఉదయం ఇప్పుడు తిరిగి తగు పత్రాలతో ఆయన ఇడి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. విచారణ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సమన్లు, తన హాజరీ సాధారణమే అని, ఎన్నికల కాలం కాబట్టి దీనికి వేరే విశేషం ఏమీ లేదని తెలిపారు. ఇదంతా వృధా ప్రయాస. ఏమి లేని దానిలో నుంచి ఏమి సాధిస్తారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News