Wednesday, January 22, 2025

కథలో కొత్తదనం, వినోదం ఉంటాయి

- Advertisement -
- Advertisement -

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ’డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ’బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ మాట్లాడుతూ “దర్శకుడు క్లాక్స్ చెప్పిన కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఈ సినిమా ఓకే చేశా. ‘బెదురులంక 2012’ కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంతా కొత్తగా ఉంటుంది.

సినిమా పూర్తయ్యాక చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. రెండున్నర గంటలు ఈ సినిమాను ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. పంచ్ టు పంచ్ డైలాగులా కాకుండా సందర్భానుసారంగా కామెడీ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ శంకర వరప్రసాద్. శివ ఓ స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు. రామ్ చరణ్‌కు ట్రైలర్ నచ్చింది.

మ్యూజిక్ బావుందని చెప్పారు. ఈ సినిమా కథ 2012 నేపథ్యంలో, పల్లెటూరిలో జరుగుతుంది. ప్రజలు పరుగులు తీసే సీన్ ఒకటి ఉంది. ఎక్కువ మంది జనాలు కావాలి. ఖర్చు విషయంలో నిర్మాత అసలు రాజీ పడలేదు. కథ చెప్పడానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చారు. సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకొచ్చారు. కథానాయికగా నేహా శెట్టిని సూచించారు. ఆయన నిర్మాణంలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అదేవిధంగా సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News