Wednesday, January 22, 2025

బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉంది.. మాట్లాడటం వేస్ట్

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉంది.. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ అని ఎపి పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళవారం కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. “నందమూరి బాలకృష్ణకి బుర్రే ఉంటే? అతని తండ్రిని మోసం చేసిన చంద్రబాబుని ఆరోజు ఎందుకు సపోర్ట్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని నడిపేవాడు కదా? మెంటల్ సర్టిఫికెట్ ఉన్న బాలకృష్ణ గురించి మాట్లాడటం కూడా శుద్ధ దండగ.

టీడీపీ కుర్చీని యనమల లాక్కుంటారా.. లేక బాలకృష్ణ లాక్కుంటారా? ఇంకొకరు తీసుకుంటారా అనేది తెలియదు. మొత్తం మీద ఆ పార్టీని కబ్జా చేయడానికి కుట్ర జరుగుతోంది. టిడిపి బంద్‌ను ఎవరూ పట్టించుకోలేదు. బంద్‌రోజు చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూసివేయలేదు. చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు.  దాచుకో, దోచుకో అన్నట్టుగా బాబు పాలన సాగింది. పోలవరాన్ని బాబు ఎటిఎంలా వాడుకున్నారు” అని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News