Wednesday, January 22, 2025

కారుణ్య నియామక పత్రాలు అందించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సుబేదారి: కారుణ్య నియామకంపై ఎంపికైన 33 మందికి హన్మకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం నియామక పత్రాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. కారుణ్య నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా 20 మంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు, 2 కాలేజియేట్ ఎడ్యుకేషన్, 1 ఐఅండ్‌సీఏ, 4 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, 3 పంచాయతీరాజ్, 1 ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్, 2 రెవెన్యూ మొత్తం 33 మందికి నియామక పత్రాలు అందచేశారు.

నూతనంగా ఎంపికైన 33 మందికి ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంటు మహ్మద్ ఇర్ఫాన్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News