Tuesday, November 5, 2024

టీకా తీసుకుంటే కానుకలు

- Advertisement -
- Advertisement -

Karur District to Give Away Gifts to People Getting Vaccinated

తమిళనాడులో వినూత్న ప్రోత్సాహం

చెన్నై : టీకాలు తీసుకునేవారికి ప్రోత్సాహాలు కొన్ని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. తమిళనాడు లోని కరూర్ జిల్లా యంత్రాంగం రాష్ట్రంలో ఆదివారం జరగనున్న మెగా టీకా డ్రైవ్‌లో టీకా తీసుకునే వారిపై కానుకల జల్లు కురిపించనున్నది. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్‌తో సహా పలు బహుమతులను అందజేయనుంది. ఈమేరకు కరూర్ జిల్లా కలెక్టర్ టి. ప్రభుశంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా టీకా వేయించుకున్న వారి కోసం జిల్లా యంత్రాంగం లక్కీ డ్రా నిర్వహించనుంది. లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేయనున్నారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్చర్ గ్రైండర్ అందజేయనున్నారు. 24 ప్రెజర్ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నట్టు చెప్పారు. అలాగే టీకా కేంద్రాలకు లబ్ధిదారుల్ని తీసుకురావడంలో స్వచ్ఛందంగా పనిచేసే వారికి రూ. 5 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. 25 కంటే ఎక్కువ మందిని తీసుకు వచ్చే వాలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతామన్నారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ప్రశంసించారు.

టీకా తీసుకోనివారు ఆఫీస్‌కు రావొద్దు

కరోనా టీకా తీసుకోని ఉద్యోగుల పట్ల ఢిల్లీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నది. ఇప్పటివరకు కనీసం ఒక్క టీకా డోసయినా తీసుకోని ఉద్యోగులు అక్టోబర్ 16 నుంచి కార్యాలయాలకు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఒక్క డోసు అయినా తీసుకున్న తర్వాతే వారికి అనుమతి ఇవ్వనుంది. దానికి సంబంధించి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News