Monday, December 23, 2024

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్ నియమాకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌ను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కాపర్తికి చెందిన కాసం వెంకటేశ్వర్లు ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఎబివిపి కార్యకర్తగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం అంచలంచెలుగా ఎదుగుతూ పార్టీలో కీలకగా బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం, కేంద్రంలో అధికార చేపట్టే విధంగా తనవంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

అదే విధంగా బిజెపి లీగల్ సెల్‌ను రాష్ట్ర నాయకత్వం 15 మందితో కూడిన బృందంతో ఏర్పాటు చేసింది. కన్వీనగర్‌గా రామారావును నియమించగా ఆరుగురిని జాయింట్ కన్వీనర్లుగా, మరో 8 మందిని మెంబర్లుగా నియమించారు. వీరికి తోడు మరో ముగ్గురు సలహాదార్లు కూడా రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. అడ్వకేట్లు నర్సింహారెడ్డి, రాంచందర్ రావు, ఆంథోని రెడ్డిని పార్టీ నియమించింది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం జిల్లాలకు ఇన్ చార్జీలను నియమించింది. మంచిర్యాల జిల్లాకు మహేశ్ బాబు, కొమురంభీం అసిఫాబాద్‌కు అరుముల పోషం, సిద్దిపేటకు శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి అర్భన్‌కు సరికొండ విద్యాసాగర్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు కల్వల త్రిలోకేశ్వర్, భాగ్యనగర్, మలక్ పేటకు రవీందర్ రెడ్డిని ఇన్ చార్జీలుగా నియమించింది. వీటితో పాటు అసెంబ్లీ ప్రభారీలను 119 నియోజకవర్గాలకు 107 అసెంబ్లీ నియోజకవర్గాలకు బిజెపి ప్రభారీలను నియమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News